calender_icon.png 23 September, 2024 | 4:07 AM

వెంకన్నను అప్రతిష్ఠపాలు చేయొద్దు

23-09-2024 02:08:28 AM

లడ్డులో కల్తీపై విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలి

టీడీపీ, వైసీసీలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచన

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తిరుమల తిరుపతి ఆలయ లడ్డుపై వివాదం దురదృష్టకరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి పేర్కొన్నారు. దేశ, విదేశాల్లో స్వామి భక్తులు లడ్డు విషయంలో ఆందోళన చెందుతున్నారని ఆదివా రం ఓ ప్రకటనలో జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి వెంకన్నస్వామి అందరివాడని, టీడీపీ, వైసీసీ రాజకీయ గొడవల్లో శ్రీవారి ఆలయాన్ని, ప్రసాదాన్ని అప్రతిష్ఠపాలు చేయొద్దని జగ్గారెడ్డి కోరారు.

ఏపీ సీఎం  చంద్రబాబునాయుడు విజనరీ లీడర్ అని, అలాంటి వ్యక్తి ఇంత మంది భక్తులను ఆందోళనకు గురి చేసేలా స్టేట్‌మెంట్ ఎందుకిచ్చారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు, జగన్ రాజకీయ కొట్లాటలు ఉంటే వేరే వాటిపై చూపించాల ని, దేవుడి విషయంలో మాత్రం ఇది సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం లడ్డు కల్తీ విషయమై ఆందోళన వ్యక్తం చేసినట్లు గుర్తు చేశారు. కల్తీ విషయ మై తక్షణమే విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని జగ్గారెడ్డి కోరారు.