05-03-2025 01:35:55 AM
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): పార్టీలోని నాయకుల మధ్య అంతర్గత గొడవలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ సీరియస్ అయ్యారు. పార్టీలో ఎవరైనా గొడవపడినా.. పార్టీపై బహిరంగంగా విమర్శలు చేసినా ఊరుకునే ప్రసక్తేలేదని పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ల వల్లే సమస్యలు వస్తే.. వారిని ఆ పదవి నుంచి తొలగించేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించమని, పార్టీ లైన్‌దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.
పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశంలో భాగం గా మంగళవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన మెద క్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం వేర్వేరుగా జరిగింది. ఈ సమావేశాల్లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై సమీక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల ప్రజాపాలనలో పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నిర్ణయాలైన కులగణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై మీనాక్షి నటరాజన్ అభిప్రాయాలు తీసుకున్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉంద ని, సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటుపైన కీలకంగా చర్చించారు. రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైన పార్టీ నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు. పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లోపించకుండా, ఐక్యంగా ముందుకుసాగాలని సూచించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరినీ కలుపుకొనిపో వాలని, ఎమ్మెల్యేలు ప్రజలకు ఎల్లవే ళలా అందుబాటులో ఉండాలని సూచించారు.
మీనాక్షి ముందుకు పటాన్‌చెరు పంచాయితీ..
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ ముందుకు పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ పంచాయితీ వచ్చిం ది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం తాను పని చేశానని, ఇప్పుడు తాను కష్టకాలంలో ఉంటే ఎవరూ అండగా లేరని ఆ నియోజక వర్గనాయకుడు కాట శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తమను పట్టించుకోవడం మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయంలో పార్టీ నేతలకు మీనాక్షి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. పార్టీ అన్ని గమనిస్తోందని, కార్యక ర్తలకు అన్యాయం జరగదని ఆమె భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా మంత్రి దామోదర రాజనరసింహతో మీనాక్షి ప్రత్యేకంగా సమావేశమై పటాన్‌చెరులో ఏమి జరుగుతోందని వివరణ అడిగినట్లు సమాచారం. సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పార్టీ నేతలతో మీనాక్షి నటరాజన్ అన్నారు. ఈ రెండు నియోజక వర్గాల్లో పార్టీని మరింత పటిష్టం చేయాల్సి ఉంటుందని, నాయకులందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. పార్టీ కార్యకర్తకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఐక్యంగా ఉండి వెంటనే స్పందించాలని ఆమె సూచించారు.
పదేళ్లలో కేసీఆర్ చేయని పనులు చేస్తున్నాం..
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీ సీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ పాలన లో కేసీఆర్ చేయని పనులను కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే చేశామని తెలిపారు. సంస్థా గతంగా పార్టీ నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవశ్యకత ఉందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఐక్యమత్యంగా కృషి చేయాలన్నారు. గాంధీ సిద్ధాంతాలకు, నిజా యితీకి మీనాక్షినటరాజన్ నిలువెత్తు నిదర్శమని అన్నారు. మెదక్ పార్లమెంట్ సమావేశంలో జిల్లామంత్రి దామోదర రాజనరసింహ, ఇన్‌చార్జ్ మంత్రి కొండా సురేఖ, పీసీసీ వర్కిం గ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కేంద్ర మాజీమం త్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు, నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.