అల్లు అర్జున్‌పై ఎక్స్ వేదికగా కొద్ది రోజుల క్రితం ప్రశంసలు కురిపించిన అమితాబ్ బచ్చన్ మరోసారి ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ గొప్ప ప్రతిభావంతుడని ఆయన పేర్కొన్నారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన 16వ సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. దీనికి తా జాగా కోల్‌కతాకు చెందిన ఒక గృహిణి కంటెస్టెంట్‌గా వచ్చా రు.
ఆమె తనకు అల్లు అర్జున్, అమితాబ్ అంటే చాలా ఇష్టమని షోలో తెలిపారు. దీనిపై స్పందించిన అమితాబ్.. “అల్లు అర్జున్ తను సంపాదించుకున్న గుర్తింపునకు పూర్తి అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్’ మంచి విజయం సాధించింది. మీరు ఆ సినిమాను చూడకుంటే వెంటనే చూడండి. అతడు గొప్ప ప్రతిభ గల నటుడు. ఆయనతో నన్ను పోల్చవద్దు” అని చెప్పారు. కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉంటుందని.. ఈ షో వల్ల అమితాబ్‌ను కలిశానని.. ఏదో ఒకరోజు అల్లు అర్జున్‌ను కూడా కలుస్తానని కంటెస్టెంట్ తెలిపారు.