calender_icon.png 6 November, 2024 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిల్లరీతో కమలను పోల్చొద్దు

06-11-2024 12:33:22 AM

ఈసారి హ్యారిస్ విజయం పక్కా

వాషింగ్టన్, నవంబర్ 5: అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని చిన్న రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసి, కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర చర్చ మొదలైంది. 2016 ఎన్నికల్లో మహిళల మద్దతు కూడగట్టినప్పటికీ డొలాల్డ్ ట్రంప్ చేతిలో డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఓటమి చెందారు.

ఈసారి కూడా ఒపీనియన్ పోల్స్‌లో అత్యధిక మంది మహిళలు కమల హ్యారిస్‌కు సపోర్ట్ చేసినప్పటికీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ట్రంపే గెలుస్తారనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడైన శ్రీ థానేదార్ ఖండించారు. ఎన్నికల సందర్భంగా ఇండియా టుడేకు ఆయన సోమవారం ఇంటర్వ్యూ ఇచ్చారు.

హిల్లరీ క్లింటన్, కమల హ్యారిస్ మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. మిషిగన్‌లో కమల ఆరు ఎన్నికల ర్యాలీలను నిర్వహించినట్టు చెప్పారు. రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారని తెలిపారు. హిల్లరీ మిషిగన్‌కు అసలు రాలేదని పేర్కొన్నారు. కమల, ట్రంప్‌ల వ్యక్తిత్వాలు వేరువేరని తెలిపారు.

ట్రంప్‌ను ప్రజల భయాలతో ఆడుకునే కోపదారి వ్యక్తిగా అభిర్ణించారు. కమల మృదుస్వాభావం కలిగి సానుకూల దృక్పథంతో ఉంటుందన్నారు. అలాంటప్పుడు కోపదారి మనిషినికి మద్దతు తెలుపుతారా? లేక సానుకూల దృక్పథం ఉన్న మహిళకు సపోర్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.

పెద్ద ఎత్తున మహిళలు కమలకు మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు. మహిళల హక్కులకు ఆమె సంరక్షకురాలిగా ఉంటారని స్పష్టం చేశారు. అంతేకాకుండా లింగ అసమానతలను అత్యంత తొందరగా తగ్గిస్తారని తెలిపారు.