calender_icon.png 22 February, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13 వేలు ఇచ్చేవరకు నిజామాబాద్‌కు రావొద్దు

22-02-2025 01:47:58 AM

  1. నిజామాబాద్‌లో రూ. 10వేలు 
  2. సాంగ్లీలో రూ. 13వేలు పసుపు ధర 
  3. మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి వెల్లడి

నిజాంబాద్, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి): నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ధర 10 వేలు ఉంటే సాంగ్లీ మార్కెట్లో 13వేల రూపాయలు ఉందని. రైతులకు కనీస మద్దతు ధర 13వేల రూపాయలు ఇప్పించే వరకు నిజామాబాద్ ఎంపీ ధర్మ పురి అరవింద్ పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి నిజామా బాద్‌కు రావద్దని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  డిమాండ్ చేశారు.

నిజామాబాద్ నగరంలోని జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ నిజామా బాద్‌లో పసుపు ప్రధాన వాణిజ్య పంట అని కుటుంబం మొత్తం తొమ్మిది నెలలు కష్టపడి పనిచేస్తే పసుపు పంట చేతికి వస్తుందని అలాంటి పసుపు ఒకప్పుడు క్వింటాల్ అమ్మితే తులం బంగారం వచ్చే దని ఇప్పుడు ఆ విషయం దేవుడు ఎరుగని ప్రస్తుతం పసుపు పంట అమ్మితే రెండు గ్రాముల బంగారం కూడా రావడం లేదని ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్లో దళారులను అరికట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బిజెపి పసుపు బోర్డుపై అనుసరిస్తున్న ధోరణి వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు మూడు నాలుగు రోజులు పసుపు కుప్పలపై పడుకునే పరిస్థితి దాపురించిందని పసుపు బోర్డు కార్యాలయం ఢిల్లీలో ఉండగా ప్రస్తుతం చైర్మన్ అంకాపూర్‌లో ఎంపీ అరవింద్ హైదరాబాదులో ఉంటే రైతులకు ఇలాంటి తిప్పలు తప్పవని ఆయన అన్నారు.

పసుపు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వలేక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నిజామాబాద్ మార్కెట్ గంజి చాల విశాలమైనదని నిర్మల్ జగిత్యాల కోరుట్ల ఆర్మూర్ బాల్కొండ రూరల్ నియో జకవర్గ అల్లా రైతులు పసుపు క్రయవిక్ర యాలు ఇక్కడ జరుపుతారు అన్నారు.

అలాంటి మార్కెట్లో పసుపు ద్వారా క్విం టాలకి 8 వేల నుండి 9000 వరకు తగ్గిపోవడానికి కారణం కాంగ్రెస్ బిజెపిలో కారణమని ఆయన ఆరోపించారు మార్కె ట్లో ఒకటి రెండు కుప్పలకు 10 వేల ఒక్క రూపాయి రెండు అని చెప్పి మిగతా వారి  పసుపు పంటను  తక్కువగా ధర నిర్వహించి కొంటున్నా రన్నారని ఈ పద్ధతిలో రైతులు విపరీతంగా నష్టపోతున్నారని ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

దళారులు ఒకపక్క అడ్డదారుల్లో 8500 కొంటూ న్నారని కటాపరేట్ తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం మార్కెట్ కమిటీ ఉన్నట్టు మాకు సమాచారం ఉందని ప్రశాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. గంజ్ లో ఉన్న ప్రతి కుప్ప ఈ వేళలో కొనాల్సిందేనని ఆ దిశగా ఏర్పాట్లు మార్కెట్ కమిటీ చేయాలని ఆయన సూచించారు . రైతులకు నాకు ఇష్టం కలిగించే విధంగా పసుపును తక్కువ ధరకు అమ్మేలా చూస్తే ఊరుకునేది లేదని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని ఆయన కలెక్టర్ కోరారు. పసుపు ధర మద్దతుకు 12000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారని గంజిలో 10000 వస్తే మరో రెండు వేలు క్వింటాల్ కు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని నియోజకవర్గాలలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇన్చార్జీలు సీఎం దృష్టికి పసుపు రైతుల విషయం తీసుకెళ్లాల ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.

బిజెపి ప్రభుత్వం 2019 పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన 10 రోజుల్లో పసుపు బోర్డు చేస్తామని మద్దతుతో రా అని చెప్పి ఐదేళ్ల తర్వాత పసుపు బోర్డు తెచ్చారని ఆ పసుపు బోర్డు ఉత్తుత్తి పసుపు పొడిని పక్కగా పనిచేసే పసుపు బోర్డు ఇందూరపు తేవాలని ప్రశాంత్ రెడ్డి ఎంపీ అరవింద్ కు సూచించారు.

పసుపు బోర్డు లేనప్పుడు క్వింటాల్ పసుపు కు 16 వేల రూపాయలు మొదలుకొని 23 వేల రూపాయల వరకు కొనసాగిందని ఇప్పుడు పదివేల రూపాయలు మాత్రమే మద్దతు ధర లేని పసుపు బోర్డు గుండు సున్నా తో సమానం అని ఆయన అన్నారు. 

పసుపు బోర్డు చైర్మన్ అంకాపూర్ లో బోర్డు కార్యాలయం ఢిల్లీలో ఉండడంతో గందరగోళ పరిస్థితి రైతులు నెలకొందని పసుపు ధరల విషయమై పసుపు పంట అమ్మకాల విషయమై రైతులు గందరగోళంలో ఉన్నానని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు ఒరిగింది ఏమీ లేదని కేవలం పల్లెగంగారెడ్డికి పసుపు బోర్డ్ చైర్మన్ పదవి వచ్చింది తప్ప రైతులకు ఎలాంటి మేలు జరగలేదని ఆయన చేశారు.

సాంగ్లీ లో లాగా రైతులకు పసుపు క్వింటాల్ రేటు అధికంగా వచ్చే విధంగా చూడాలని అధికారులను మార్కెట్ కమిటీ సిబ్బందిని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్స్ రెగ్యులరైజేషన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారని ప్లాట్స్ యజమానులు ఎవరు కూడా ఒక్క రూపాయి కట్టవద్దని అన్నానని కానీ ప్రస్తుతం వెల కట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ సమావేశంలో మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర మాజీ రెడ్కో చైర్మన్ నగర అధ్యక్షులు సిర్ప రాజు  సత్య ప్రకాష్ పసుపు రైతులు పాల్గొన్నారు.