07-03-2025 12:00:00 AM
ఓయూ వీసీ చాంబర్‌లో విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6(విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న దివ్యాంగ విద్యార్థుల నుంచి మెస్ బిల్లులు వసూలు చేయడం సరికాదని పరిశోధక విద్యార్థులు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఓయూ వీసీ చాంబర్‌లో బైటాయించి నిరసన తెలిపారు. ఫెల్లోషిప్స్ వస్తునాన్నాయనే ఉద్ధేశంతో బిల్లులు కట్టాలనడం సరికాదన్నారు. బిల్లులు తగ్గించి న్యాయం చేయాలని వీసీని, ప్రభుత్వాన్ని వారు కోరారు.