calender_icon.png 16 January, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరేం అనుకున్నా డోంట్ కేర్

13-01-2025 12:00:00 AM

పెళ్లి, పిల్లలు.. అయినా తరగని అందంతో వరుస అవకాశాలను అందుకుంటూ, యువ కథానాయికలకు ధీటైన పోటీ ఇస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం ఆమె చేతిలో ఏక మొత్తంగా 8 సినిమాలు ఉండటం ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు.  ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొంటూ విజయ తీరాలకు చేరడంలో ఆమెకు ఆమే సాటి. ఒక్క సినిమాలే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, సొంతంగా కొన్ని బిజినెస్‌లు నిర్వహిస్తున్నారు.

ఆమె బిజినెస్‌లలో ఫెమి 9 శానిటరీ నాప్కిన్ కూడా ఒకటి. ఈ సంస్థ స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా మధురైలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ వేదికపై నయనతార తన సక్సెస్ సీక్రెట్‌ను వెల్లడించారు. ‘జీవితంలో ఎదగాలన్నా, విజయం సాధించాలన్నా ప్రతి ఒక్కరిలో రెండు విషయాలు తప్పక ఉండాలి.

ఆ రెండు లక్షణాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోవద్దు.. వదులుకోవద్దు. ఆ క్వాలిటీస్ ఏంటంటే.. ఒకటి ఆత్మగౌరవం, రెండోది ఆత్మవిశ్వాసం. ఈ రెండూ ఉంటే ఏదైనా సాధించగలరు. నా జీవితంలో నేను ఈ రెండు విషయాలనే గట్టిగా నమ్ముతా. ఎవరు ఎన్ని అనుకున్నా ఆత్మగౌరవాన్ని వదులుకోవద్దు.

ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉంటే మనల్ని ఎవరూ విమర్శించలేరు. మీలో ఈ రెండు క్వాలిటీస్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఇక మనలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే నిజాయితీగా ఉండాలి. ఎవరు ఏం అనుకున్నా పట్టించుకోవద్దు. నీచమైన, చెప్పుడు మాటలను అసలే పట్టించుకోకూడదు’ అంటూ హితబోధ చేసింది నయనతార.