calender_icon.png 28 October, 2024 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచ పర్వతాపూర్ స్థలాలను కొనొద్దు

13-07-2024 04:44:38 AM

  • అవి సాలార్ జంగ్ భూములు 
  • వారసుడు అబ్దుల్ వాహబ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా కంచ పర్వతాపూర్ గ్రామంలో వెంచర్ల ద్వారా విక్రయిస్తున్న భూములు కొనొద్దని సాలార్ జంగ్ వారసుడు సయ్యద్ అబ్దుల్ వాహబ్ సూచించారు. ఆ భూములు అండ ర్ కస్టోడీ ఆఫ్ అవార్డ్స్ పద్ధతిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు అడ్వకేట్ జితేందర్‌రెడ్డి, లక్ష్మణ్‌తో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సాలార్ జంగ్‌కు వివాహం కాలేదని, ఆయనకు సంతానం లేరన్నారు. దీంతో సాలార్ జంగ్ భూముల ను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిందని తెలిపారు. ఆ భూములకు ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు కూడా లేవన్నారు.

కొందరు స్థానికులు తప్పుడు పద్ధతుల్లో లింక్ డాక్యుమెం ట్లు సృష్టించి, ప్రజలకు విక్రయిస్తున్నారని తెలిపారు. మొత్తం 326.15 ఎకరాల్లో ఇప్పటికే 100 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని చెప్పారు. పిర్జాదీగూడలో నిర్మాణాల కూల్చివేత జరిగిన ప్రదేశం కూడా అదేనన్నారు. వీటికి సంబంధించి హైదరాబాద్ రాష్ట్రం 1955లో చేసిన గెజిట్, ఇతర రెవెన్యూ రికార్డులన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. సాయి ఐశ్వర్య, సాయిప్రియ, సత్యనారాయణపురం పేర్లతో వెంచర్లు వేశారన్నారు. ఇవన్నీ అక్రమమైనవని తెలిపారు. ఈ విషయంలో కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.