calender_icon.png 11 March, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ బహుమతులు తేవొద్దు..

10-03-2025 11:46:22 PM

ఎంపీ తేజస్వీ సూర్య..

బెంగళూరు: దేశంలోనే అతిపిన్న వయసు ఎంపీల్లో ఒకరిగా గుర్తింపుపొందిన తేజస్వి సూర్య చెన్నైకి చెందిన ప్రముఖ గాయని శివశ్రీ స్కంద ప్రసాద్‌ను పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహ విందు ఆదివారం బెంగళూరులో ఘనంగా జరిగింది. అయితే దీనికి ముందు తమ రిసెప్షన్‌కు వచ్చే వారికి తేజస్వి ఓ విజ్ఞప్తి చేశారు. పూలు, డ్రైఫ్రూట్స్‌ను కానుకగా ఇవ్వొద్దని కోరారు. తమ వివాహ సమయంలో అతిథులు పెద్దమొత్తంలో పూలు, బొకేలను బహుమతులుగా తెచ్చారని.. పెళ్లి తర్వాత 24 గంటల్లో వాటిలో 85 శాతం పూలను పారేయాల్సి వచ్చిందన్నారు. ప్రతి ఏడాది వివాహాల సమయంలో దాదాపు 3 లక్షల కిలోల డ్రైఫ్రూట్స్ మిలిగిపోతున్నాయని.. వాటి విలువ రూ.315 కోట్లని వివరించారు. వృథాను నివారించేందుకు తమ రిసెప్షన్‌కు వచ్చే అతిథులు బొకేలు, డ్రైఫ్రూట్స్ తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు.