వేధిస్తే ఎస్మా తప్పదు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎస్మా కింద చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు తన దృష్టికి వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సీఎం సూచించారు.
పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురిచేయడం లాం టి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఎక్క డైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.