calender_icon.png 3 March, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు

03-03-2025 12:00:00 AM

చేర్యాల, మార్చి 2:  ఇంటర్మీడియట్ ప్రైవేటు కళాశాలల యజమాన్యం విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే వాటిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి తాడూరి భరత్ డిమాండ్ చేశారు. చేర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేర్యాల పట్టణంలో పలు కళాశాల యజమాన్యం విద్యార్థులను వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులను ఇబ్బంది చేయకుండా, ప్రశాం త  వాతావరణంలో రాసే విధంగా చర్యలు చేపట్టాలని ఇంటర్మీడియట్ విద్యాధికారులకు సూచించారు. హల్ టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తున్న యజమాన్యంపై చర్య లు తీసుకోవాలన్నారు. అవసరమైతే గుర్తింపును కూడా రద్దు చేయాలన్నారు. ఈ కార్య్ర కమంలో ఎస్‌ఎఫ్‌ఐ  నాయకులు సంజ య్, సమీర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.