ఎస్పీ జానకి షర్మిల
భైంసా, నవంబర్ 13(విజయక్రాంతి) : బాసర ఆర్జీయూకేటీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. ఆర్జీయూకేటీని భైంసా ఏఎస్సీ అవినా శ్కుమార్తో కలిసి ఆమె బుధవారం సందర్శించారు. అక్కడి అధికారులతో మాట్లాడి శాంతి భద్రతలను పర్యవేక్షించారు.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకో కుండా భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఇక్కడి పరిస్థితులపై సామా జిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమ్మవద్దన్నారు.