07-02-2025 01:12:25 AM
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): నేషనల్ రూరల్ డెవలప్ ంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ పేరుతో ఓ పత్రికలో ఉద్యోగాల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన వచ్చిందని, అలాంటి మోసపూరిత యాడ్స్‌ను నిరుద్యోగులు నమ్మొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 4వ తేదీన 6,881 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ప్రకటన వచ్చిందని, అది తప్పుడు ప్రకటనగా తేల్చిచెప్పింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిలో అలాంటి శాఖ లేదని, ఈ ప్రకటన ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నిరుద్యోగు లను మోసం చేసేందుకు, వారికి టోకరా ఇచ్చేందుకే ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారని వెల్లిడించింది. నిరు ద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.