calender_icon.png 15 October, 2024 | 11:42 AM

అతివిశ్వాసం వద్దు!

15-10-2024 02:09:33 AM

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ‘అతివిశ్వాసం వద్దు. ఐక్యంగా ఉండండి. వాస్తవ ప్రతికూల పరిస్థితులను గుర్తించండి. వాటికి ఎదురొడ్డి పోరాడండి’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే పిలుపునిచ్చారు. హర్యా నా ఎన్నికల ఫలితాల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయాని ప్రస్తావించకుండానే ఆయన మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేతలకు చురకలు అంటించారు.

మరికొ ద్దిరోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మంగ ళవారం న్యూఢిల్లీలోని ఖర్గే నివాసం లో ఆ రాష్ట్ర నేతలతో భేటీ అయ్యా రు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై కీలక సూచనలు చేశా రు.  పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించారు.

‘మహావికాస్ అఘాడీ’ ఎత్తుగడలను తిప్పికొ ట్టే వ్యూహాలపై  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. పార్టీ నేతలు కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలను కలపుకొని పోవాలన్నారు. అంతర్గత విభేధాలను పక్కన పెట్టాలన్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.