మలక్పేట్ మార్కెట్ చైర్పర్సన్ చెకోలేకార్ లక్ష్మి
మలక్పేట, నవంబర్ 20: మలక్పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్ లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై నూతన చైర్పర్సన్ చెకోలేకార్ లక్ష్మి, పాలకవర్గం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో మార్కెట్ ప్రాం గణమంతా దుర్గంధంగా దుయ్యబట్టారు. పాలకవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి బుధవారం మలక్పేట మాహబూబ్ మాన్షన్ మార్కెట్లో పర్యటించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. కిరాణా దుకాణాల ముందు అడ్డదిడ్డంగా వ్యాపార లావాదేవీలు నిర్వహి స్తున్న వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్, డైరెక్టర్లు, ఎస్జీఎస్ దామోదర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చెకోలేకార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.