calender_icon.png 20 October, 2024 | 5:12 AM

నిరుద్యోగులు మోసపోవద్దు

20-10-2024 02:01:40 AM

  1. అందరికీ న్యాయం జరుగాలనే జీవో 29 తెచ్చాం
  2. గ్రూప్-1 అభ్యర్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దు
  3. పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19(విజయక్రాంతి): నిరుద్యోగులారా స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు వారి మాటలు నమ్మి మోసపోకండని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్‌ఛె ముగింపు కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదేళ్లలో ఉద్యోగాల భర్తీని అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గతంలో అభ్యర్థులు ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరిగేవారని, వాయిదాల వల్ల విద్యార్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు.

గ్రూప్ అభ్యర్థులంతా మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి, లేదంటే బంగారు అవకాశాన్ని కోల్పోతారని ఆయన స్పష్టం చేశారు. ఆందోళనలో పాల్గొంటున్న నిరుద్యోగులపై ఎలాం టి కేసులు పెట్టొద్దని పోలీసులను ఆదేశించా రు. గ్రూప్-1 అధికారులుగా వారు తెలంగా ణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కాబోతున్నారని తెలిపారు.

గత పాలకులు నిరుద్యో గులను ఎప్పడైనా కలిశారా? ఎప్పుడైనా అశోక్‌నగర్ వచ్చి మాట్లాడారా? ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారా? అని ప్రశ్నించారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణ విధానాన్ని న్యాయస్థానాలు సమర్థించాయని పేర్కొన్నారు. గ్రూప్-1 విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు వితండవాదం చేస్తున్నాయన్నారు.

ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి ప్రాణాలను బలిగొని రాజకీయాల్లో ఉన్నత పదవులు అనుభవించారని విమర్శించారు. వారి ఉచ్చులో పడొద్దని అపోహలు వీడి ఆందోళన విరమించాలని సోదరుడిలా సూచన సూచిస్తున్నానని చెప్పారు. పదేళ్లుగా వాయిదా పడుతున్న ఉద్యోగాలను తమ ప్రభుత్వంలో భర్తీ చేస్తున్నామని స్పష్టంచేశారు.

కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగ నియామకాలు భర్తీ కాకుండా ప్రయత్నించారని ఆరోపించారు. అయినా అన్నింటిని ఎదుర్కొని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తున్నామన్నారు.  జీవో నంబర్ 55 ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులే నష్టపోతారని, అందరికీ న్యాయం జరగాలనే ప్రభుత్వం జీవో 29ని తీసుకువచ్చిందని స్పష్టం చేశారు.

గ్రూప్-1 మెయిన్స్‌లో 1:50 కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నాం. అభ్యర్థులు ఆందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. మోసగాళ్ల మాటలు విని మోసపోవద్దని నిరుద్యోగులను కోరారు. వారిది కొంగ జపమని అభ్యర్థులు గమనించాలన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించవద్దని సూచించారు. 

తెలంగాణ పోలీసులు ఆదర్శంగా నిలవాలి

తెలంగాణ పోలీసులు ఆదర్శంగా నిలవాల ని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు స్ఫూర్తిని ఇచ్చేలా పోలీస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో పోలీ సులు కీలక పాత్ర పోషించారని, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగం ఎప్పటికీ మరచిపోలేనిదని పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగం అంటే అది కేవ లం ఉద్యోగం కాదని..

అది ఒక భావోద్వేగమ ని అన్నారు. పోలీస్‌శాఖ గౌరవం పెరిగితేనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట పెరుగుతుందని, చిన్న పొరపాటు జరిగినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని చెప్పారు. పోలీస్ సేవలు, త్యాగాల వల్లే  ప్రజలు నిర్భయంగా ఉండగలుగుతున్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయని తెలిపారు.

పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరలోనే పోలీస్ సిబ్బంది పిల్లల కోసం 50  ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించాల ని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మొద టి విడతగా 5 నుంచి 8వ తరగతి వరకు క్లాస్ లు ప్రారంభిస్తామని, ఆ తర్వాత ఒక్కో తరగతిని పెంచుకుంటూ వెళతామని తెలిపారు.

పోలీసులకు పెను సవాల్‌గా సైబర్ నేరాలు..

సైబర్ నేరాలు ప్రజలకు, పోలీసులకు పెను సవాల్‌గా మారాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. సమాజంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గతంలో జరిగిన నేరాలకు, ప్రస్తుత నేరాలకు పొంతన లేదు. డ్రగ్స్ మహమ్మారి రాష్ట్రానికి సవాలుగా మారింది.

పొరు గు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి గంజాయి రవా ణా పెరిగింది. జిల్లాల్లోని పోలీసులు గంజాయిని రాష్ట్ర సరిహదుదల్లోనే సమర్థంగా అడ్డు కోవాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో  డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, సీఐడీ డీజీపీ బీ శివధర్‌రెడ్డి, టీజీఏన్బీబీ డైరెక్టర్ శిఖాగోయల్, అభిలాష గుప్త తదితరులు పాల్గొన్నారు.