calender_icon.png 20 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దు

16-04-2025 12:00:00 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ 

చెన్నూరు, ఏప్రిల్ 15: చెన్నూరు మండలంలోని ముత్తరావుపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఎమ్మె ల్యే వెంట మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, అయిత హిమవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.