17-04-2025 12:00:00 AM
వరి -కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
చిన్నచింతకుంట ఏప్రిల్ 16: రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులను నమ్మి పండించిన ధాన్యాన్ని విక్రయించకూడదని దేవర కద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం చిన్న చింతకుంట మండల కేంద్రంలో, కురుమూర్తి, అల్లిపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారం భించడంతోపాటు ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ సాయిబాబా దేవాలయం లో నిప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఎమ్మె ల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే గోనే సంచులను తీసుకొని అందుబాటులో ఉంచాలని, వర్షా లు ఎప్పుడు అంటే అప్పుడు పడుతున్న సందర్భంగా రైతుకు మేలు జరిగేలా వ్యవసాయ అధికారులు ఉండాలని సూచిం చారు.
ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలో రైతు నేరుగా వచ్చి ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వము రైతుకు జవాబు దారి తనంగా ఉంటుందన్నారు. పతి ఒక్కరి సంక్షేమం కోసమే ప్రజా పాలన ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.