calender_icon.png 29 September, 2024 | 9:08 PM

హైడ్రా పేరుతో డ్రామాలొద్దు

26-09-2024 03:34:45 AM

రాష్ట్రంలో పెద్దలకో న్యాయం.. పేదలకో న్యాయం 

మూసీ ప్రక్షాళన బాగోతం బయట పెడుతాం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు

ఫతేనగర్, ఖాజాకుంటలోని ఎస్టీపీల సందర్శన

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): హైడ్రాపేరిట డ్రామాలు చేయడం కాదు, హైదరాబాద్‌ను బాగు చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రభుత్వానికి సూచించారు.

నగరంలోని ఫతేనగర్, ఖాజాకుంట లోని మురుగు శుద్ధి కేంద్రాల(ఎస్టీపీ)లను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, మహమూద్‌అలీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. జలమండలి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం బాలానగర్‌లోని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చేనాటికి నగరంలో రోజుకు రెండు వేల ఎంఎల్‌డీల మురుగు ఉత్పత్తయ్యేదని.. కానీ, 700 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎస్టీపీలు మాత్రమే ఉండేవ ని గుర్తుచేశారు.

తాము అధికారంలోకి వచ్చాక మరో 1300 ఎంఎల్‌డీల సామర్ధ్యం గల 31 ఎస్టీపీలను నిర్మించామని స్పష్టంచేశారు. వంద శాతం మురుగు శుద్ధి చేయా లనే లక్ష్యంతో మాజీ సీఎం కేసీఆర్ ముందు చూపుతో దాదాపు రూ.4 వేల కోట్లతో ఈ ఎస్టీపీలను, ఎస్‌బీఆర్ టెక్నాలజీతో నిర్మించారని వివరించారు.

ఎస్టీపీల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులేమీ రాలేదని స్పష్టంచేశారు. ఫతేనగర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులి చ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని, 10 నెలల్లో అభివృద్ధి పనులకు పైసా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీకి కాంట్రాక్టులిచ్చే కుట్ర 

ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన 95 శాతం నీరు మూసీలోకి వెళ్తోందని, ఇక మూసీ ప్రక్షాళన ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు రూ.50 వేల కోట్లు.. రూ. 70 వేల కోట్లు అని మంత్రులు.. రూ.1.50 లక్షల కోట్లు అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారని ధ్వజమెత్తారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపె నీకి కాంట్రాక్టులు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన వెనుక ఉన్న సీఎం బాగోతాన్ని బయట పెడుతామని అన్నారు.  

సర్కారా.. సర్కసా? 

అసెంబ్లీ ఎన్నికల్లో నగర పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాలేదని, బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యేలనే ప్రజలు గెలిపించారని కేటీఆర్ అన్నా రు. ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పా రు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సర్కారును నడుపుతన్నారో.. సర్కస్‌ను నడుపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఒక శాఖ అనుమతి ఇస్తే మరోశాఖ కూలగొడుతోందని ఆరోపించారు. హైడ్రా నిర్వాసితులకు బీఆర్‌ఎస్, పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని ప్రకటించారు

. బాధితులంతా బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌కు, నగరంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వద్దకు రావాలని సూచించారు. పేదల ఇళ్ల కూల్చివేతలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని హైకో ర్టు చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తి చేశారు. హైడ్రా పేరి ట డ్రామాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, పేదల ఇళ్లపైకి తెచ్చే బుల్డోజర్లకు అడ్డుగా ఉంటామని స్పష్టంచేశారు. 

కూకట్‌పల్లిలోని హెచ్‌ఎండీఏ భూములపై సీఎం కన్నేశారని, దాదాపు వెయ్యి ఎకరాల భూమిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాం లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదని రేవంత్‌రెడ్డి అన్నారని.. ప్రస్తు తం అవే ఇళ్లను మూసీ నిర్వాసితులకు ఇస్తున్నారని అన్నా రు.

బీఆర్‌ఎస్ హయాంలో నగరంలో లక్ష డబుల్ బెడ్రూంలు కట్టి పంపిణీ చేశామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే లు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, కాలే రు వెంకటేష్, మర్రిరాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, బీఆర్‌ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

పెద్దలకో న్యాయం.. పేదలకో న్యాయం 

హైడ్రాపేరిట ప్రభుత్వం పెద్దలకో న్యాయం.. పేదలకో న్యాయం అన్నట్టు వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డా రు. ఎన్ కన్వెన్షన్‌కు గతంలో అనుమతిచ్చింది.. ఇటీవల కూల్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం నాలా పై, మంత్రుల ఇండ్లు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని ఆరోపించారు.

వారికి సమయం ఇచ్చిన హైడ్రా అధికారులు.. పేదల ఇళ్ల ను మాత్రం వెంటనే కూల్చేశారని ధ్వజమెత్తారు. పేదలను వెండింగ్ జోన్లకు తరలించాకే చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో అయ్యప్ప సొసై టీ వద్ద తాము అలాంటి చర్యలే తీసుకున్నామని గుర్తుచేశారు.

తాము అధికారం లో ఉన్నపుడు దాదాపు 30 వేల ఆక్రమణలు ఉన్నట్టు దృష్టికి వచ్చిందని, మాన వతా దృక్పథంతో వ్యవహరించామని చెప్పారు. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

ఆక్రమణల తొలగింపునకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాంగ్రె స్ హయాంలో నగరంలో రియల్ ఎస్టేట్ కుదేలవుతోందన్నారు. 42 శాతం రియ ల్ ఎస్టేట్ పడిపోయిందని తెలిపారు.