22-02-2025 01:44:39 AM
తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి
కామారెడ్డి, ఫిబ్రవరి ౨౧ (విజయ క్రాంతి): యువత నిరాశ నిస్ప్రోహలకు లోను కావద్దని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ లింబాద్రి అన్నారు. శుక్రవారం తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ( సౌత్ క్యాంపస్‌లో) ప్రాంగణంలో యువత సామాజిక వ్యవస్థాపన, భారత దేశంలో భవిష్యత్తు తరానికి మార్పు చేసే వారికి ప్రోత్సహించడం అనే అంశంపై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సు శుక్ర వారంతో ముగిసింది.
ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ హైయరి ఎడ్యు కేషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లిం బాద్రి, తెలంగాణ విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి, సమావేశానికి ముఖ్య వక్త శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనే జ్మెంట్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఎస్.ఫ్ చంద్రశేఖర్, వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ టి రవీందర్రావు, పూణీ తిలక్ మహా విద్యాలయ ఆచార్యులు ప్రొఫెసర్ ప్రకాష్ యాదవ్, పాల్గొన్నారని సెమినార్ డాక్టర్ బక్య.వీరభద్రం తెలిపారు.
తెలంగాణ రిజి స్ట్రార్ ఆచార్య యాదగిరి మాట్లాడుతూ స్థానికంగా లభిస్తున్న వనరులను ఉపయో గించుకొని, స్థానిక ఉద్యోగ అవకాశాలు కల్పించి, వ్యాపారవేత్తలుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్‌ఎస్‌ఎఫ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుత యువత సమయాన్ని మరియు డబ్బును ఏ విధంగా ఉపయోగించుకోవాలో వివరించారు.
ప్రతి విద్యార్థి మొబైల్ ఫోను ఉపయోగించకుండా పుస్తకాలు చదవాలని, జీవితంలో ఎదిగిన వారి చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ టి రవీం దర్రావు మాట్లాడుతూ జీవితంలో యువత నిరాశ నిస్పృహలకు గురికాకుండా స్వయం ఉపాధి ద్వారా ఎదగాలని, కష్టాలను సైతం జీవితాలుగా మార్చుకోవాలని, ప్రతి వ్యక్తి తనను తాను ప్రేమిస్తూ, సమాజంలోని రుగ్మతలను మార్పడానికి సామాజిక శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ దక్షిణ ప్రాంగణానికి పరిశోధన కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ రావాలని ఆకాంక్షించారు. సెమినార్ లో అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు పరిశోధన పత్రాలు సమర్పించడం ద్వారా సమాజానికి ఉపయో గపడతాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో కో.కన్వీనర్లు డాక్టర్ అంజయ్య, డాక్టర్ రాజేశ్వరి, తెలంగాణ విశ్వవిద్యాలయ పిఆర్‌ఓ డాక్టర్. పున్నయ్య మరియు కోఆర్డినేటర్లు డాక్టర్ యాలాద్రి, డా. నరసయ్య, డాక్టర్ రమాదేవి, dr.మోహన్ బాబు, డాక్టర్స్ నారాయణగుప్త, డాక్టర్ వంగ రాహుల్, వివిధ విభాగాల అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.