calender_icon.png 24 February, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధైర్య పడొద్దు అండగా ఉంటాం

24-02-2025 01:06:25 AM

కడ్తాల్, ఫిబ్రవరి 23 : ఎవ్వరు ఆధ్వర్యపడొద్దని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. ఆదివారం కడ్తాల్ పట్టణ కేంద్రంలో ఇటీవల  కందికంటి యాదమ్మ మరియు మలే లక్ష్మయ్య స్వర్గస్తులైన సందర్భంగా వారి చిత్రపటాలకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులైన పాత్రికేయులు   కందికంటి మల్లేష్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మలే మల్లేష్ గౌడ్ లను పరామ ర్శించారు.

ఈ సందర్భంగా ఎవరు అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండాలని అన్నారు.  అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ర్టంలో సంక్షేమ పాలన నడుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించే ప్రజా సంక్షేమ పథకాలను అరులైన లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని నాయకులకు వివరించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో నాయకులందరూ ఐక్యమత్యంతో కలిసికట్టుగా కృషిచేసి అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, డిసిసి ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ,

మండల పార్టీ అధ్యక్షులు బీఛ్యా నాయక్, ఆమనగల్ మండల పార్టీ అధ్యక్షులు జగన్, తలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్,కిసాన్ సిల్ మండల అధ్యక్షులు బాలరాజ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అశోక్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.