calender_icon.png 24 October, 2024 | 2:04 AM

అధైర్య పడకండి.. అండగా ఉంటాం

22-07-2024 03:04:18 AM

వర్షాలకు ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఎమ్మెల్యే యెన్నం భరోసా

మహబూబ్‌నగర్, జూలై 21 (విజయక్రాంతి): భారీ వర్షాలతో శిథిలావస్థలో, రేకుల ఇళ్లు కూలిపోయిన సంఘటనల్లో బాధితులు ఎవరూ ఆధైర్య పడవద్దు.. అందరికీ అండగా ఉంటామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి భరోసా ఇచ్చారు. టీవల కురిసిన వర్షానికి హన్వాడ మండల పరిధిలోని టంకర గ్రామంలో ఇళ్లు కూలిపోయాయి. ఈ క్రమంలో రెడ్‌క్రాస్ సంస్థ వారికి అండగా నిలిచింది. వారికి నిత్యావసర సరుకులను అందించింది.

ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి హాజరై.. బాధితులకు సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎవరూ పాత ఇళ్లలో నివాసం ఉండకూడదని, అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే ఇతర ఇల్లును తాత్కలిక నివాసం కింద ఏర్పాటు చేస్తామన్నారు. వర్షాలకు ఇళ్లు నేలమట్టం అయిన బాధితులకు ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం అందేలా కృషిచేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిష్ట్యానాయక్, నయాబ్ తలహసీల్దార్ ఖలీద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్, మండల మహిళా అధ్యక్షులు నవనీత నర్సింహులు, రెడ్‌క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ తదితరులు ఉన్నారు.