21-04-2025 12:25:41 AM
తడిసిన ప్రతి గింజను కొంటాం: ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 20 ( విజయక్రాంతి ) : అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ఎక్కడైనా వరి ధాన్యం తడిసిన అన్నదాతలు అధైర్య పడాల్సిన అవసరం లేదని తడిసిన ధాన్యాన్ని సైతం చివరి గింజ వరకు కొంటామని వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పెద్దమందడి, ఖిద్దమందడి ఘణపురం మండలాల్లోని పలు గ్రామాలలో అకాల వర్షానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో ఆయన అందుకు స్పందించి ఎవ్వరు అధైర్య పడాల్సిన అవసరం లేదని చివరి గింజ వరకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని అన్నదాతలకు భరోసా కల్పించారు.