17-04-2025 01:25:14 AM
ఈ నెల 19న సిద్దిపేట విపంచి కళానిలయంలో ఉచిత క్యాన్సర్ శిబిరం
సిద్దిపేట, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్సలు అందించి పూర్తిగా నయం చేయవచ్చునని సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు అన్నారు. ఈ నెల 19నాడు సిద్దిపేటలోని విపంచి కళ భవనంలో కిమ్స్ ఆస్పత్రి ఆంకాలజిస్ట్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైద్యులు డాక్టర్ మధు, డాక్టర్ శ్రవణ్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరాంలు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. మాజీమం త్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో సిద్దిపేటలో కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.
ఈ క్యాంపులో మోమోగ్రఫీ, పాప్స్ స్మియర్, బూత్ బ్రెస్ట్ అల్ట్రా సౌండ్, ఎక్స్రే, ఎండోస్కోపి, అల్ట్రా సౌండ్ అబ్డామిన్ అండ్ ఫెల్విన్ పరీక్షలతోపాటు మరికొన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. సుమారు రూ.18620 విలువగల అన్ని రకాల క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలరంగం, మేర సత్తయ్య, మెర్గు మహేష్, ఇర్షాద్ హుస్సేన్, పొనమల్ల రాములు, ఆంజనేయులు పాల్గొన్నారు.