ఖమ్మం, జనవరి 24 (విజయక్రాంతి): వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కవంటున్న మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ద మ్ముంటే రాజీనామా చేసి, కందాల ఉ పేందర్‌రెడ్డిపై పోటీ చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సవాల్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మం త్రి పొంగులేటిపై ఫైర్ అయ్యారు.
కాం గ్రెస్ పార్టీ చర్యల వల్ల గ్రామసభల్లో ఘర్షణలు జరిగాయన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా తిరగబడ్డారని పేర్కొన్నా రు. ఘర్షణలు వెనుక బీఆర్‌ఎస్ ఉంద ని చెప్పడం అవివేకమన్నారు. కొన్ని చోట్ల ఇందిరమ్మ కమిటీల వారు కూ డా ధర్నా చేశారని చెప్పారు.
ఏ ఒక్క గ్రామసభలోనూ ఎమ్మెల్యేలు, మం త్రులు పాల్గొనలేదని అన్నారు. గ్రా మసభల్లో పేరు రాగానే పథకాలు అ న్నీ వచ్చినట్లేనని భావిస్తున్నారని, లి స్టులో అర్హుల పేర్లు లిస్ట్ చదవడం లే దని, అది చదివితే అధికారులు, నాయకులను ప్రజలు నిలదీస్తారని అన్నారు.
గ్రామసభలు చూసి కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లేశామా అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. గొడవలు జరగకుండా గ్రామసభలు జరగలేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ 420 హామీ లు ఇచ్చి చాతగాక చేతులెత్తేశారని అన్నారు.