ఢిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు
న్యూ ఢిల్లీ, ఆగస్టు 12: వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌ను అరెస్టు చేయవద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు, యూపీఎస్సీ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కావాలంటూ పూజా కోర్టులో పిటిషన్ సమర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున ఆమెను అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవస రం లేదని కోర్టు చెప్పింది. అలాగే ఆగస్టు 21వ తేదీ వరకు ఆమెకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫేక్ ఓబీసీ, దివ్యాంగ సర్టిఫికెట్ సమర్పించారనే ఆరోపణల నేపథ్యంలో పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ బోర్డు నిషేధం విధించిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో ఎలాంటి యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా ఆమెపై బోర్టు నిషేధం విధించింది. కాగా ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 21వ తేదీన వాదనలను వింటామని కోర్టు స్పష్టం చేసింది.