calender_icon.png 9 January, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్ప నిర్మాతలను అరెస్ట్ చేయొద్దు

02-01-2025 02:20:45 AM

మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పుష్ప--2 నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌ని అరెస్ట్ చేయ రాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే దర్యాప్తు కొన సాగించవచ్చని, దీనికి నిర్మాతలు సహకరించాలని ఆదేశించింది.

పుష్ప- విడుదల సం దర్భంగా హీరో అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి సంబంధించిన ఘటనపై పోలీసులు నమో దు చేసిన కేసును కొట్టివేయాలని నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే సుజన విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్ నవీన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఈ సంఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పిటిషనర్లు కేవలం నిర్మాతలు మాత్రమేనని, జరిగిన ఘటనతో సంబంధం లేదని చెప్పా రు. హీరో అల్లు అర్జున్ రాకపై తమ కార్యాలయ సిబ్బంది థియేటర్ నిర్వాహకులకు, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చార ని స్పష్టంచేశారు.

వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తు కొనసాగించవచ్చని, పిటి షనర్లను అరెస్ట్ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై కౌం టరు దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదుదారుకు నోటీసులు జారీచేశారు.

ఇదే కేసులో అరెస్టయిన థియేటర్ మేనేజర్ అడ్ల శరత్చంద్రనాయుడు, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది చెరుకు రమేశ్, శ్రీరాములు రాజు లు బెయిలు మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి విచారణను ఈనెల 6కు వాయిదా వేశారు.