26-02-2025 12:00:00 AM
చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్
చేవెళ్ల , ఫిబ్రవరి 25: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు దాతల సహకారం అభినందనీయమని చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ అన్నారు. చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల పాఠశాలల్లో అదే గ్రామానికి చెందిన శేఖర్గౌడ్, ఆంజనేయులు యాదవ్ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నేర నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకమని, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఆలూర్ కారోబార్ నరేశ్, గ్రామస్తులు కవలంపేట శేఖర్, కొండకల్ల ఆంజనేయులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.