20-04-2025 06:51:31 PM
సీసీ కెమెరాలు ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలి..
సామాజిక కార్యక్రమంలో పాలుపంచుకోవాలి..
పెన్ పహాడ్ ఎస్సై గోపికృష్ణ పిలుపు..
పెన్ పహాడ్: గ్రామాల అభివృద్ధిలో భాగంగా మన గ్రామాలను మనమే దొంగల బెడద నుంచి రక్షించుకోవడానికి కలసికట్టుగా సహకరించుకోవడానికి ప్రజలంతా ముందుకు రావాలని ఎస్సై గోపికృష్ణ(SI Gopikrishna) పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనాజిపురం, మాచారం గ్రామాలలో ప్రధాన కూడలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటును పరిశీలించి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. సామాజిక కార్యక్రమాలలో భాగంగా అనాధలకు సేవ కార్యక్రమాలు, గ్రామాలలో దైవచింతన కార్యక్రమాలతో పాటు గ్రామాల అభివృద్ధిలో భాగంగా గ్రామ రక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, చెన్ను రమణారెడ్డి, బొబ్బయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.