calender_icon.png 19 April, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ నిర్మాణానికి దాతల విరాళం

19-04-2025 04:37:09 PM

రాజాపూర్: మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణానికి శనివారం గుమ్మకొండ యాదిరెడ్డి రూ.50వేలు, గుమ్మకొండ నర్సింహారెడ్డి రూ.50 వేలు, RTC డ్రైవర్ సాకలి యాదయ్య రూ.25 వేలు, గుర్రంకడి యాదగిరి రూ.20 వేలు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... ఆలయ నిర్మాణం కోసం దాతలు సహకరించి విరాళాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పుల్లారెడ్డి, యాదయ్య, మల్లయ్య, రామకృష్ణగౌడ్, రాంరెడ్డి, చంద్రయ్య, నర్సింలు, నారాయణ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, యాదగిరి, విష్ణు, యాదయ్య, నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.