calender_icon.png 16 March, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద వధువు వివాహానికి ముందుకు వచ్చిన దాతలు..

05-03-2025 06:33:07 PM

ఔదార్యం చాటుకున్న సంకల్ప ఫౌండేషన్..

రామయంపేట (విజయక్రాంతి): రామాయంపేట పట్టణానికి చెందిన ఓ నిరుపేద వధువు శరణ్య బిందు వివాహానికి దాతలు ముందుకువచ్చారు. రామయంపేట పట్టణంలోని దుర్గమ్మ బస్తిలో ఉంటున్న నిరుపేద కుటుంబం అయిన వధువు శరణ్య బిందు, వివాహానికి గాను పట్టణానికి చెందిన దాతలు సంకల్ప పౌండేషన్ ఆధ్వర్యంలో 17వేల రూపాయలు క్వింటల్ బియ్యాన్ని అందజేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన శరణ్య బిందు, అమ్మమ్మ లలిత తన వంతు సహాయంగా కొంత డబ్బు సమకూర్చగా ఈ విషయాన్ని సంకల్ప ఫౌండేషన్ సభ్యులు తెలుసుకొని తాము కూడా అండగా ఉంటామని ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా 17వేల రూపాయలతో పాటు గజవాడ నాగరాజు క్వింటల్ బియ్యాన్ని అందించారు. నిరుపేద కుటుంబాలకు సంకల్ప పౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గజవాడ నాగరాజు, ఎస్.కె అహ్మద్, చింతల యాదగిరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.