13-03-2025 04:42:28 PM
వైరా,(విజయక్రాంతి): ప్రభుత్వం మార్కెట్ ద్వారా మొక్కజొన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసి మొక్కజొన్న రైతులు ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్(Telangana Farmers Association Khammam President Dondapati Ramesh) ప్రభుత్వాన్ని అన్నారు. గురువారం వైరా మండల తాటిపూడి గ్రామంలోజరిగిన రైతు సంఘ సమావేశంలో దొండపాటి రమేష్ మాట్లాడుతూ మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు పరిస్థితులు అవగాహన చేసుకుని మొక్కజొన్న పంటల రైతులు దళారీల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈనెల 20వ తారీకు వైరా పట్టణంలో కమ్మవారి కళ్యాణ మండపంలో జరిగే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా మహాసభలో రైతుల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు .ఈ సమావేశంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు దొబ్బల కృష్ణ ,కొండా రామకృష్ణ, జిల్లా నాయకులు బండారుపల్లి ముత్తయ్య ,రవి ,కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు