హైదరాబాద్: వరద బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ కు కురుమ సంఘం 10 లక్షలు విరాళం ఆదివారం ప్రకటించింది. ఆకాల వర్షాల వల్ల తెలంగాణలో వరదలతో సర్వస్వం కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కురుమ సంఘం ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి తెలంగాణ కురుమ సంఘం తరఫున ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు శ్రీ బీర్ల ఐలయ్య, శ్రీ ఎగ్గె మల్లేశం, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.10 లక్షల చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.