calender_icon.png 17 April, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివయ్య గుడికి విరాళాల వెల్లువ

08-04-2025 06:22:12 PM

ఫలించిన మాజీ సర్పంచ్ కసిరెడ్డి సాయి సుధ రత్నాకర్ రెడ్డి కృషి..

హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, తొందర్లోనే గుడి నిర్మాణం పూర్తి..

చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్న శివయ్య గుడికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. అయితే గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన శివుడి గుడి ఉండేది. అది రాను రాను రోడ్డు కంటే కిందికి ఉంది. అయితే మాజీ గ్రామ సర్పంచ్ కాసిరెడ్డి సాయి సుధా రత్నాకర్ రెడ్డి శివాలయాన్ని నూతనంగా నిర్మించాలని సంకల్పించుకున్నారు. గ్రామస్తులందరితో మమేకమై విరాళాలను సేకరించడం మొదలుపెట్టారు. స్పందిస్తున్న గ్రామస్తులు, కొంతమంది డోనార్లు గుడి నిర్మాణానికి లక్షల్లోకి విరాళాలు అందజేస్తున్నారు.

ఏలేటి రామయ్యపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఎలేటి రామ్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు కోడళ్ళు ఏలేటి రాజు ప్రసన్న, శ్రీనివాస్ జమునలు రూ.3 లక్షల విరాళాన్ని అందజేశారు. మండల కేంద్రానికి చెందిన బీరవోలు నిర్మల త్రిలోకేంద్రారెడ్డి దంపతులు రూ.2 రెండు లక్షల విరాళాన్ని, నవాబుపేట గ్రామానికి చెందిన లక్షణాచార్యులు చిన్న కుమారుడు రంగాచార్యులు రూ.1,16,000 తాజాగా కాల్వ శ్యాంసుందర్ రెడ్డి 1,01,116 రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షుడు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డికి అందజేశారు. దీంతో శివయ్య గుడి నిర్మాణ పనులు అతివేగంగా జరుగుతున్నాయి. కాగా శివయ్య ఆశీస్సులతోనే విరాళాలు అందజేయడానికి డోనర్లు, గ్రామస్తులు ముందుకు వస్తున్నారని ఆలయ కమిటీ అధ్యక్షుడు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.