calender_icon.png 30 November, 2024 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసూలు చేసిన విరాళాలు తిరిగివ్వాలి

30-11-2024 02:36:54 AM

మాజీ ఎమ్మెల్యే నడిపెల్లిని కోరిన ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల, నవంబర్ 29 (విజయక్రాంతి): మంచిర్యాల గోదావరి తీరంలో శ్మశానవాటిక నిర్మాణం పేరుతో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు వసూలు చేసిన విరాళాలను తిరిగి దాతలకే ఇవ్వాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు కోరారు. శుక్రవారం మంచిర్యాల ప్రధాన మార్కెట్‌లోని రోడ్డు విస్తరణ పనులను సమీక్షించి వ్యాపారలు పలు సూచనలు చేశారు. అనంతరం కాలేజ్ రోడ్లు శ్మశానవాటిక నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు శ్మశానవాటిక నిర్మాణం కోసం దాతల నుంచి రూ.90 లక్షల వరకు చందాల రూపంలో వసూలు చేసినట్టు చెప్పారు. కానీ శ్మశానవాటికను నిర్మించలేదన్నారు. అలాంటప్పుడు వసూలు చేసిన విరాళాలను తిరిగి దాతలకే అందజేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

డిసెంబర్ ఏడవ తేదీలోపు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే చందాలు వసూలు చేసిన వారిపై, మధ్యవర్తులపై దాతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. కాగా మంచిర్యాల నియోజకవర్గంలో రెండేండ్లలో ఇరవై ఏండ్ల అభివృద్ధిని చేసి చూపిస్తానని ఎమ్మెల్యే పీఎస్‌ఆర్ ధీమా వ్యక్తం చేశారు.