18-03-2025 06:14:20 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమానికి మంగళవారం ప్రముఖ వ్యాపారి చాట్ల శ్రీశైలం విరాళం అందించారు. రాబోయే శ్రీరామనవమి ఉత్సవాలకు గాను 21 క్వింటాళ్ల బియ్యం రూ.15 వేల నగదు ఆశ్రమానికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధులు పండరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.