calender_icon.png 19 April, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవాలాల్ మహారాజ్ ఆలయానికి విరాళం

17-04-2025 10:26:01 PM

బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం లో నల్లమడుగు తండా లో సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి బిజెపి రాష్ట్ర నాయకులు ప్రముఖ పారాశ్రామికవేత్త సైంటిస్ట్ ఐడి ఎల్లారెడ్డి గుడి అభివృద్ధి కోసం 1,00,000/- రూపాయలు గురువారం రాత్రి తండవాసులకు విరాళంగా అందజేశారు. గుడి లో అన్నదాన కార్యక్రమానికి క్వింటల్ బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాట్లాడుతూ... ప్రముఖ సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి మా మధ్యలో ఉండడం మా అదృష్టమని అన్నారు. గత రెండు నెలల కిందట గుడికి నావంతు సహాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చిన ప్రకారమే గురువారం రూ 1,00,000 లు విరాళం అందజేయడంతో గ్రామస్తులకు మాకు చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు.  గుడికి, బడికి , అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు నిర్మించడం దాదాపు మీ యొక్క ట్రస్టు ద్వారా ఎన్నో కోట్లు ఖర్చు చేశారు మీలాంటి వ్యక్తి మా మధ్యలో ఉండడం దేవుడిచ్చిన వరమనీ ఈ సందర్భంగా గ్రామస్తులు  తెలియజేశారు.