calender_icon.png 20 April, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి విరాళం

24-03-2025 01:23:57 AM

కామారెడ్డి, మార్చి 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఓ ఉద్యోగి ఒక నెల మొదటి వేతనాన్ని ఆదివారం విరాళంగా అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన పురం  తిరుపతిరావు కవితల కుమారుడు మొదటి నెల వేతనం రూ. 51,016  రూపాయలు విరాళంగా ఆలయ కార్యనిర్వణాధికారికి అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో దాత లను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్ రావు ఆలయ ప్రధాన అర్చకులు నరసింహచార్యులు, శ్రీనివాసాచార్యులు, సంతోష్ చార్యులు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.