ప్రకటించిన క్రిప్టోకరెన్సీ బిలియనీర్
బ్యాంకాక్, డిసెంబర్ 27: థాయ్‌లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ సెన్సేషన్ బేబీ హిప్పో మూ డెంగ్‌కు భారీ విరాళం అందింది. క్రిస్మస్ పండగ సందర్భంగా కెనడాకు చెందిన క్రిప్టోకరెన్సీ బిలియనీర్ విటాలిక్ బుటెరిన్ రూ.2.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. థాయ్‌లాండ్‌లోని సిరాచాలో గల ఖావో ఖీవ్ ఓపెన్ జూలో బేబీ హిప్పో(5 నెలలు) ఉం టుంది.
దీనికి సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు ఉన్నారు. ఇటీవల మైకెల్ జాక్సన్ ఫేమస్ డ్యాన్స్ మూన్‌వాక్ మూమెంట్స్ చేసి న వీడియో అంతర్జాతీయంగా అందరినీ ఆకట్టుకుంది. అంతేకాక అమె రికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారని జోష్యం చెప్పిం ది. దీంతో బేబీ హిప్పో సంరక్షణ కోసం కెనడాకు చెందిన క్రిప్టోకరెన్సీ బిలియనీర్ విటాలిక్ బుటెరిన్ రూ. 2.5 కోట్ల భారీ విరాళాన్ని జూ నిర్వాహకులకు అందించారని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.