14-04-2025 05:12:04 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి తండాలో నూతనంగా నిర్మిస్తున్న దుర్గమ్మ దేవాలయానికి ఆత్మ చైర్మన్ పోలేపల్లి నెహ్రూ రెడ్డి, మాజీ సర్పంచ్ జాటోత్ సుజాత హరీష్ నాయక్ దంపతులు రెండు లక్షల రూపాయల వ్యయంతో దుర్గామాత విగ్రహం, కలశంగా విరాళంగా అందజేశారు. అలాగే భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తమ వంతు చేయూతనందిస్తామని ప్రకటించారు. మాజీ ఎంపీటీసీ గూగులోత్ సునీత వీరు నాయక్ దంపతులు మైక్ సెట్ సమకూర్చారు. గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ 20 వేల రూపాయల విలువైన గ్రానైట్ అందించగా, మాజీ వార్డు సభ్యుడు బిర్రు వెంకన్న 20 వేల రూపాయలను అందించారు. ఆలయ స్థల దాత భానోత్ విజయ, ఆమె కుమారులు రామోజీ, రాజేష్, ఇతర దాతలను ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.