13-03-2025 05:50:28 PM
పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా దోసపహాడ్ యూపీస్ పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించిదానికి ముందుకు వచ్చి దాత్రుత్వం చాటుకున్నారు. ఓ దాత, ఎన్ఆర్ఐ. దోసపహాడ్ కు చెందిన ఎన్ఆర్ఐ దొంగరి కవిత-మంగయ్య దంపతులు తమ గ్రామ పాఠశాల అభివృద్ధి కి తమ వంతుగా రూ. 45 వేలు ఇంచార్జి హెచ్ఎమ్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మామిడి వెంకన్నకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు రాయి కింది వెంకటేశ్వర్లు, వై ఎంకన్న, గ్రామ కార్యదర్శి జానీ వర్మ, దొంగరి పవన్, పందిరి వీరస్వామి,ఫీల్డ్ అసిస్టెంట్ కొండేటి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.