calender_icon.png 15 March, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి రూ.6 లక్షల విరాళం

14-03-2025 08:46:11 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కోసం భక్తులు విశేషంగా సహకరిస్తున్నారు. జానకి సదనం నిర్మాణ నిమిత్తం ఎన్. కృష్ణదేవరాయులు అచల దంపతులు, డి. శాంత పార్వతి దేవి గ, ఎన్. విజయలక్ష్మి దేవి  కలిసి రూ. 6 లక్షలు విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని చెక్క్ ద్వారా ఆలయ ఈవో ఎల్ రమాదేవికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భద్రాచల రాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరింత భాగస్వాములు కావాలని దేవస్థానం అధికారులు కోరారు.