13-03-2025 07:00:25 PM
కామారెడ్డి అర్బర్,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయానికి మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు గురువారం ఐదు లక్షల విరాళాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావును ఘనంగా సన్మానించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఐదు లక్షల రూపాయల నగదు ఆలయ కమిటీ సభ్యులకు విరాళంగా అందజేశారు. కమిటీ సభ్యులు నర్సింగ్ రావుకీ వేద పండితుల చేత ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు, నర్సింగ్ రావు వెంట నరేందర్ రావు, బాల్ రాజ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రామ్మోహన్, మాజీ సర్పంచ్ మద్దెల రాజు, Amc డైరెక్టర్ కొత్త అరవింద్, మాజీ ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి, సన్నీ గౌడ్, రాహుల్ గౌడ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.