నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పిటిషన్
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీజేపీ ఎమ్మె ల్యే మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. దానంపై ఫిర్యాదు చేయడానికి ఈ నెల 1వ తారీఖున వెళితే స్పీకర్ లేరని, ఆయన కార్యాలయ సిబ్బంది తీసుకోవడానికి నిరాకరించినట్లు తెలిపారు. కనీసం పిటిషన్‌ను స్వీకరించి ధ్రువీకరించాలని కోరినా ఫలితం లేకపో యిందన్నారు. అందువల్ల తప్పనిసరి పరిస్థితు ల్లో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఇప్పటికే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపై పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లతో ఈ పిటిషన్ను కలిపి జస్టిస్ విజయసేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టనున్నారు.