calender_icon.png 17 November, 2024 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల 2 నెలల జీతం విరాళం

09-09-2024 04:14:03 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు తమ రెండు నెలల వేతనాన్ని వరద బాధితులకు సహాయంగా అందజేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. పీసీపీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌తో కలిసి సీఎం నిర్ణయం తీసుకున్నారని ఆదివారం సచివాలయంలో మీడియాకు తెలిపారు. వరదల్లో నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని శ్రీధర్‌బాబు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కూలిన ఇళ్లకు, నష్టపోయిన పంటలకు, చనిపోయిన పశువులకు కూడా పరిహారం అందించనున్నట్టు పేర్కొన్నారు.