24 May, 2026 | 2:11 PM

Breaking News

భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

విద్యార్థుల విరాళం

27-11-2025 05:06 PM

నిర్మల్ (విజయక్రాంతి): వశిష్ఠ హై స్కూల్ ఆదర్శ్ నగర్ విద్యార్థులు శ్రీ సాయి అనాధ వృద్ధాశ్రమం, మంచిర్యాల వారికి తమవంతు సాయంగా విరాళాలు సేకరించి అందజేశారు. మొత్తం 18,860 రూపాయలు విరాల రూపంలో సేకరించారు. సందర్భంగా పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ విధంగా సేవ దృక్పథంతో ముందుకురావడం గొప్పదని, ఈ వయస్సు నుండే వారిలో సేవ భావన నేర్పించిపడం ముఖ్యమని, అనాధ అని అనుకునే వాళ్ళకి ఈ విధంగా మన మందరం తోడున్నాం అని తెలపాలని కోరుతూ విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా అధిక విరాళాలు సేకరించిన పిల్లలకు మెడల్స్ ప్రదానం చేశారు, వీరిలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులు నౌమన్-6th, శ్రవణ్-8th, రక్షిత్-8th, కేతన్ నాయక్-1st, ఆర్యన్-3rd లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గొల్లపల్లి మాధవి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.