18-03-2025 12:08:53 AM
దాతల సహకారంతో ఎల్‌ఈడిటీవీ వితారణ విరాళం ఇచ్చిన వ్యాపార వేత్త సల్గుటి విష్ణు వర్ధన్‌రెడ్డి సన్మానం
చిన్న చింతకుంట మార్చి 17 : విద్య అభివృద్ధికి వ్యాపారవేత్త నలుగుటి విష్ణువర్ధన్ రెడ్డి రూ రెండు లక్షల రూపాయలను విరాళం చేయడం జరిగింది. ఈ డబ్బులతో విద్యా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో యుపిఎస్ స్కూల్ సంత బజార్ లో దాతల సహకారంతో ఎల్‌ఈడి టీవీ డిజిటల్ బోర్డు ఏర్పాటుకు విరాళం అందించిన సల్గుటి విష్ణు వర్ధన్ రెడ్డి ప్రారంభించారు.
అనంతం ఆయన మాట్లాడుతూ విద్య అభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు విద్య విషయంలో ఎలాంటి తారతమ్యం లేకుండా సహకరించాలని ఆయన కోరారు. అనంతరం దాత లను శాలువాలతో సన్మానించారు ఈకార్యక్రమంలో విద్య అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఎస్.సుధాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు వజిర్ బాబు, బత్తుల బాలరాజు,బాలేష్ గుప్త, యాకోబు, మహమూద్, ప్రతాప్,ఖాజమైనోదిన్,రిజ్వన్,సల్లాఉద్దిన్,కుర్వ శంకరయ్వ,కాంత రెడ్డి, అహ్మద్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.