calender_icon.png 6 March, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోశాల అభివృద్ధికి లక్ష రూపాయల విరాళం

06-03-2025 12:22:32 AM

పిట్లం మార్చి 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన ప్రసిద్ధ వ్యక్తి డాక్టర్ అచ్యుతం, తమ ఉదాత్తమైన ఉదారతను మరోసారి చాటుకున్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో గల శ్రీ సోమయ్య స్వామీజీ గోశాలకు బుధవారం నాడు లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. 

ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ బండయ్యప్ప మట్టి సంస్థాన్ శ్రీ సోమయ్య స్వామీజీ డాక్టర్ అచ్యుతంను ఆశీర్వదిస్తూ, గోశాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ విరాళం గోవుల సంరక్షణకు, గోశాల నిర్వహణకు వినియోగించబడుతుందని తెలిపారు. గోశాల ప్రతినిధులు  నీతూ, స్వప్న డాక్టర్ అచ్యుతంకి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.