21-04-2025 12:17:23 AM
మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 17 కోట్లతో నిర్మించ తలపెట్టినున్న వంద గదుల కాటేజీల నిర్మాణానికి దాతలు సహకారం అందించడానికి ముందుకొస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాదులోని రా జేంద్రనగర్ కు చెందిన స్వాతి వినోద్ కుమారుల దంపతులు వారి పూర్వీకుల జ్ఞాపకార్థం కాటేజీ నిర్మాణానికి విరాళముగా లక్ష రూపాయల చెక్కును ఆలయ ఈవో అన్నపూర్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, డిప్యూటీ ఇంజనీర్ మహిపాల్ రెడ్డి, ఏ ఈ ఓ బుద్ధి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.