calender_icon.png 2 March, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడు ప్రాంత ప్రజల సౌకర్యార్ధం మార్చురీ ఫ్రీజర్ బాక్స్ బహుకరణ

01-03-2025 10:15:04 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు ప్రాంత ప్రజల సౌకర్యార్ధం మార్చురీ ఫ్రీజర్ బాక్స్ ను సల్లూరి నర్సయ్య-లక్ష్మమ్మ దంపతులు, సల్లూరి కేశవులు జ్ఞాపకార్ధంగా వారి కుటుంబ సభ్యులు బహుకరించారు. దానిని శనివారం బోడు గ్రామపంచాయతీ కార్యాలయానికి చేర్చారు. బోడు పోలీసుస్టేషన్ పరిధిలోని 44 గ్రామాల ప్రజలు మార్చురీ ఫ్రీజర్ బాక్స్ ను ఉపయోగించుకోవచ్చని గ్రామస్తులు తెలిపారు. బోడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని వివరించారు. కావాల్సిన వారు బోడు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని కోరారు. ఈ యొక్క మార్చురీ ఫ్రీజర్ బాక్స్ ని బోడు, కొప్పురాయి, రామచంద్రునిపేట, సంపత్ నగర్, లచ్చగూడెం, గంగారాం ప్రజల తరపున దాతలకు ప్రజలు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.